Preme saswathamaina Song Lyrics
Preme saswathamaina Song Lyrics in Telugu
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ||2||
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
||ప్రేమే||
1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము ||2||
ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను....
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా
||ప్రేమే||
2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో ||2|
కరువు సీమలో సిరులొలికించెను -నీవాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యక్రములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా
||ప్రేమే||
3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి ||2||
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీరాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా....
||ప్రేమే||
Preme saaswathamaina Song Lyrics in English
- నేను వెళ్లే మార్గము
- పాడెద స్తుతి గానము
- మహదానందమైన యేసయ్య సన్నిధి
- శ్రీకరుడా నా యేసయ్యా
- అతిసుందరుడవు
- అమరమైన ప్రేమ
- దేవుని సంకల్పం
Devunike mahima ganatha keerthi adhikara prabhavamulu kalugunu gaaka hallelujah amen 🙏
ReplyDelete