Sambaramaye Bethlehemulo Lyrics
Credits:Album: Sambaramaye Bethlehemulo
Song: Sambaramaye Bethlehemulo
Lyrics, Tune & Sung By : Joshua Gariki
Music: J.K.Christopher
Mixed and Mastered by : Sam K. Srinivas
Sambaramaye Bethlehemulo Lyrics in Telugu
సంబరమాయె బేత్లెహేములోసందడియాయె పశులపాకలో |2|
నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా..
యేసు అవతరించెను
లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/
1. దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు |2|
రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని |2|
రక్షణ మనకు తెచ్చాడని…
పరుగున వెళ్లారు – యేసును చూచారు
పాటలు పాడారు – నాట్యం చేశారు |2|సంబర
2. తార చూపిన దారిలో –యేసుని చూడవెళ్ళే గొల్లలు |2|
యూదుల రాజుని చూడాలని
భక్తితో యేసుని మ్రొక్కాలని |2|
త్వరపడి యేసుని చేరాలని..
వేగమె వెళ్లారు – యేసుని చూచారు
కానుక లిచ్చారు – యేసుని పూజించారు |2|సంబర