Yesayya naa pranama ganamaina sthuthi ganamaa lyrics - Hosanna Song Lyrics 2025

Yesayya naa pranama ganamaina sthuthi ganamaa Song lyrics

Yesayya naa pranama ganamaina sthuthi ganamaa అనే పాట 2025  సంత్సరంలో  Hosanna Ministries వారిచే రచించబడింది మరియు  పాటని  జాన్ వెస్లీ అన్న , అబ్రహాం  అన్న  మరియు రమేష్ అన్న గారు పాడారు.2025 వ సంత్సరానికి మిగిలిన పాటలను గుడారాల పండుగలో విడుదల చేస్తారు.
yesayya na pranam


Yesayya naa pranama ganamaina sthuthi ganamaa Song lyrics:

పల్లవి : 
యేసయ్యా  నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా-2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే 
నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను 
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన 
నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా 
               (యేసయ్యా  నా ప్రాణమా)1
చరణం:
1.చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని 
  నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని 
  ఆనందగానము నే పాడనా -2
  ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2
  సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే -2
                               ("యేసయ్యా  నా ప్రాణమా")
2.జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని 
  జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని 
  ఉత్సాహగానము నే పాడనా -2
  ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని 2
  ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా-2
                             ("యేసయ్యా  నా ప్రాణమా")
3.మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం 
  మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం 
  స్తోత్రగీతముగా  నే పాడనా-2  
  నిజమైన అనురాగం చూపావయ్యా -స్థిరమైన అనుబంధం నీదేనయ్యా-2
  స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా-2  
                               ("యేసయ్యా  నా ప్రాణమా")
         స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన "2"
         ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా "2"

Yesayya naa pranama ganamaina sthuthi ganamaa Video Song 



More Songs


Previous Post Next Post